గాంధీ ఆస్పత్రిలో తుపాకీ మిస్‌ఫైర్‌

     Written by : smtv Desk | Tue, Mar 27, 2018, 05:21 PM

గాంధీ ఆస్పత్రిలో తుపాకీ  మిస్‌ఫైర్‌

హైదరాబాద్‌, మార్చి 27: గాంధీ ఆస్పత్రిలో తుపాకీ మిస్‌ఫైర్‌ అయింది. ఈ ఘటనలో కానిస్టేబుల్‌కు గాయాలయ్యాయి. ఆస్పత్రి జైలు వార్డు వద్ద కానిస్టేబుల్‌ సాయినాథ్‌ తుపాకీ శుభ్రం చేస్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఛాతిలోకి బుల్లెట్‌ దూసుకుపోవడంతో కానిస్టేబుల్‌ను వెంటనే ఆస్పత్రిలోని ఎమర్జెన్సీ వార్డుకు తరలించారు. పోలీసు ఉన్నతాధికారులు ఆస్పత్రికి వచ్చి కానిస్టేబుల్‌ను పరామర్శించారు. చిలకలగూడు పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.





Untitled Document
Advertisements