ప్రైవేటు బస్సు, పాల వ్యాన్ ఢీ..ఒకరి మృతి

     Written by : smtv Desk | Fri, Mar 30, 2018, 12:08 PM

ప్రైవేటు బస్సు, పాల వ్యాన్ ఢీ..ఒకరి మృతి

కృష్ణా జిల్లా, మార్చి 30: హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్తున్న ప్రైవేటు ట్రావెల్స్‌ బస్సు నందిగామ సమీపంలో పాల వ్యానును ఢీకొట్టింది. ఈ ఘటనలో బస్సు బోల్తా పడింది. పాల వ్యానును వేగంగా ఢీకొట్టడంతో వ్యాను డ్రైవర్‌ అక్కడికక్కడే మృతిచెందాడు. బస్సులో ప్రయాణిస్తున్న 25 మంది తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు.
Untitled Document
Advertisements