బస్సుపై రాళ్ళతో దాడి..

     Written by : smtv Desk | Fri, Mar 30, 2018, 03:06 PM

బస్సుపై రాళ్ళతో దాడి..

ఏలూరు, మార్చి 30: బీఎస్ఆర్ ట్రావెల్స్ కు చెందిన ఏసీ స్లీపర్ బస్సు భీమవరంవైపు వెళ్తుండగా కైకలూరు బైపాస్‌లో కొందరు గుర్తుతెలియని వ్యక్తులు బస్సుపై రాళ్లు విసిరారు. ఈ దాడితో భయభ్రాంతులైన ప్రయాణికులు ఒక్కసారిగా కేకలు వేయడంతో దుండగులు అక్కడి నుంచి పరారయ్యారు.

అనంతరం డ్రైవర్‌ బస్సును సమీపంలోని వన్‌టౌన్‌ పోలీసుస్టేషన్‌కు తరలించాడు. ప్రయాణికులకు ఇబ్బందులు తలెత్తకుండా వారిని వేరే బస్సులో ఎక్కించారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని, దుండగుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

Untitled Document
Advertisements