ఘనంగా గుడ్ ఫ్రైడే వేడుకలు

     Written by : smtv Desk | Fri, Mar 30, 2018, 03:58 PM

ఘనంగా గుడ్ ఫ్రైడే వేడుకలు

మైదుకూరు,మార్చి 30: మైదుకూరులోని క్రిస్టియన్‌ సోదరులు శుక్రవారం ఘనంగా గుడ్ ఫ్రైడే వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా ప్రార్థనా మందిరాల్లో వేకువజామునే ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఈ పండగను పురస్కరించుకొని పట్టణంలోని పలు చర్చీ లను విద్యుత్తు దీపాలతో అలంకరిచారు.

ఏసు తలపై ముళ్లకిరీటం పెట్టి శిలువ మోయించే సన్నివేశాలను పట్టణ పురవీధుల్లో క్రిస్టియన్‌ భక్తులు ప్రదర్శించారు. ఏసును కీర్తిస్తూ భక్తిగీతాలను ఆలపించారు. సర్వమానవుల పాపాల కోసం ఏసు తన రక్తాన్ని శిలువలో పణంగా పెట్టారంటూ పట్టణంలోని ఆర్‌సీఎం మతగురువు ప్రభాకర్‌ పేర్కొన్నారు.

Untitled Document
Advertisements