తల తెగింది.. అయిన బ్రతికి ఉంది

     Written by : smtv Desk | Fri, Mar 30, 2018, 04:12 PM

తల తెగింది.. అయిన బ్రతికి ఉంది

థాయిలాండ్, మార్చి 30 ‌: కొన్ని విషయాలు మనం వినడానికి చాలా వింతగా ఉంటాయి. కానీ నమ్మక తప్పదు.. తల లేకుండా ఏజీవి అయిన బ్రతకగలదా..? కానీ ఒక కోడి తల లేకుండా జీవిస్తోంది. థాయ్‌లాండ్‌లోని రచ్చబురి రాష్ట్రంలో గుర్తించిన తల లేని కోడిని ఓ పశువైద్యురాలు సంరక్షిస్తున్నారు. దాని మెడ కిందగా గొంతులోకి ఆహారం వేస్తూ.. యాంటిబయాటిక్స్‌ ఇస్తూ పోషిస్తున్నారు. 'తల లేకున్నా ఈ కోడి భయపడడంలేదు. బాగానే స్పందిస్తుంది. ఇదినిజంగా ధైర్యమున్న కోడి' అని ఆమె పొగుడుతున్నారు. దీని తల ఎలా తెగిందో తెలియదని, ఏదైనా ఇతర జంతువు దాడిలో ఇలా జరిగిఉండవచ్చని స్థానికులు భావిస్తున్నారు. 1945-47 మధ్య అమెరికాలో ఓ కోడి తల లేకుండా 18 నెలలు జీవించి రికార్డులకు ఎక్కింది.





Untitled Document
Advertisements