కన్నుల పండువగా దుర్గామల్లేశ్వరస్వామి కల్యాణం

     Written by : smtv Desk | Fri, Mar 30, 2018, 04:47 PM

కన్నుల పండువగా దుర్గామల్లేశ్వరస్వామి కల్యాణం

ఇంద్రకీలాద్రి, మార్చి 30: శాస్త్రోప్తవేతంగా వేదపండితుల మంత్రోఛ్ఛారణల మధ్య దుర్గామల్లేశ్వరస్వామి దివ్య కల్యాణం నేత్రపర్వంగా రుత్వికులు నిర్వహించారు. మల్లేశ్వరాలయ సమీపంలోని రాయబార మండపంలో వధువు, వరుడి తరఫున కొంత మంది పండితులు వారి గొప్పతనాన్ని వివరిస్తూ ఎదురుకోలోత్సవం నిర్వహించారు.

అనంతరం మల్లేశ్వరాలయ ప్రాంగణంలో గంగా, పార్వతీ సమేత మల్లేశ్వరస్వామి వార్ల ఉత్సవమూర్తులకు వార్షిక లీలా దివ్య కల్యాణం శాస్త్రోక్తంగా రుత్వికులు నిర్వహించారు. ఈ కళ్యాణ మహోత్సాం లో అధిక సంఖ్యలో భక్తులు హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు.


Untitled Document
Advertisements