స్కూల్ వద్ద సైకో వీరంగం

     Written by : smtv Desk | Fri, Mar 30, 2018, 05:01 PM

కోసిగి, మార్చి 30: వేట కొడవలితో ఉపాధ్యాయుడిని చంపుతానంటూ అగసనూరులో ఓ సైకో వీరంగం సృష్టించాడు. ఈక్రమంలో మధ్యాహ్నం పాఠశాల వదిలిన సమయంలో సైకో మద్యం తాగి పాఠశాల ప్రహరీ బండలను వేటకొడవలితో పగులగొడుతుండగా ఉపాధ్యాయుడు శరత్‌ అడ్డుకున్నాడు. దీంతో ఆవేశంతో సైకో రాముడు ఉపాధ్యాయుడి గొంతుపై వేటకొడవలి పెట్టి చంపేస్తానని బెదిరించాడు. అతడి నుంచి తప్పించుకుని వెంటనే తరగతి గదిలోకి వెళ్లి తలుపులు వేసుకున్నాడు. ఉపాధ్యాయుడు గ్రామంలోని యువకులకు ఫోన్‌ చేయడంతో వారంతా వచ్చి అతడిని పట్టుకుని పోలీసులకు అప్పగించారు.

Untitled Document
Advertisements