గుడ్‌ఫ్రైడే వేడుకల్లో మంత్రి నారాయణ

     Written by : smtv Desk | Fri, Mar 30, 2018, 05:40 PM

నెల్లూరు, మార్చి 30: గుడ్‌ఫ్రైడే వేడుకల్లో భాగంగా నగరంలోని సెయింట్‌ జోసెఫ్‌చర్చిలో రాష్ట్ర పురపాలికశాఖ మంత్రి పొంగూరు నారాయణ పాల్గొని ప్రార్థనలు నిర్వహించారు. అనంతరం కొద్దిదూరం ఏసు శిలువను మోశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏసుక్రీస్తు వలె శాంతి సమాధానాలు కలిగి ఉండాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే కృష్ణారెడ్డి, బిషప్‌ ఎండీ ప్రకాశం తదితరులు పాల్గొన్నారు.

Untitled Document
Advertisements