పరమేశ్వరీ ఆలయంలో ప్రత్యేక పూజలు: ఇస్రో చైర్మన్‌

     Written by : smtv Desk | Fri, Mar 30, 2018, 05:52 PM

పరమేశ్వరీ ఆలయంలో ప్రత్యేక పూజలు: ఇస్రో చైర్మన్‌

నెల్లూరు, మార్చి 30: జీఎస్‌ఎల్‌వీ -ఎఫ్‌8 రాకెట్‌ ప్రయోగం విజవంతం కావాలని కోరుతూ ఇస్రో చైర్మన్‌ డా.శివన్‌ చెంగాల పరమేశ్వరీ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ ప్రయోగం కోసం 27 గంటల పాటు కౌంట్‌డౌన్‌ చేపట్టిన విషయం తెలిసిందే. గురువారం సాయంత్రం శ్రీహరికోటలోని సతీష్‌ ధావన్‌ అంతరిక్ష కేంద్రం నుంచి 4 గంటల 56 నిమిషాలకు జీఎల్‌ఎస్‌వీ-ఎఫ్‌8 రాకెట్‌ నింగిలోకి ఎగరనుంది.

ఈ ప్రయోగ సన్నాహాల్లో భాగంగా శాస్రవేత్తలతో డా. శివన్‌ సమావేశమయ్యారు. అనంతరం ఆయన మాట్లాడుతూ..ఈ ఏడాది చివర్లో చంద్రయాన్‌-2 ప్రయోగం చేయాబోతున్నట్లు ప్రకటించారు. వచ్చే నెలలో పీఎస్‌ఎల్‌వీ రాకెట్‌ను ప్రయోగంచనున్నట్లు తెలిపారు.

Untitled Document
Advertisements