రైల్వే ట్రాక్‌ కింద పడి యువకుడు ఆత్మహత్య

     Written by : smtv Desk | Fri, Mar 30, 2018, 06:10 PM

అనకాపల్లి, మార్చి 30: అనకాపల్లి సమీపంలో రైల్వే ట్రాక్‌ కింద పడి యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. వివరాల్లోకెళ్తే చోడవరం అంబేరుపురం గ్రామానికి చెందిన రాజశేఖర్‌(32) భార్య ఉండగానే మరో మహిళతో అక్రమ సంబంధం కొనసాగించాడు.

ఈ క్రమంలో ఆ మహిళకు రాజశేఖర్‌కు మనస్పర్థలు రావడంతో మనస్తాపం చెంది ఆత్మహత్య చేసుకుంటున్నట్లు తనకు తానుగా చిత్రీకరించిన వీడియోలో తెలిపాడు. వీడియోలో తన తల్లికి, భార్యకు ద్రోహం చేసినట్లు పేర్కొన్నాడు. విషయం తెలుసుకున్న రైల్వే పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Untitled Document
Advertisements