ప్రత్యేక హోదా కోసం రక్తదాన శిబిరం

     Written by : smtv Desk | Fri, Mar 30, 2018, 06:25 PM

విశాఖ, మార్చి 30: ప్రత్యేక హోదాతో పాటు విభజన హామీల అమలు కోసం ఉత్తరాంధ్ర చర్చా వేదిక ఆధ్వర్యంలో విశాఖలో శుక్రవారం రక్తదాన శిబిరం జరిగింది. చర్చా వేదిక కన్వీనర్‌ కొణతాల రామకృష్ణ రక్తదానం చేసి ఈ కార్యక్రమాన్ని ప్రారభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... రాష్ట్ర హక్కుల కోసం రాజకీయ పార్టీలన్నీ తమ జెండాలను పక్కన పెట్టి పోరాడినప్పుడే కేంద్రం దిగివస్తుందన్నారు. బీజేపీకి చెందిన పార్లమెంట్‌ సభ్యులు, శాసన సభ్యులు రాజీనామా చేసి ప్రజాతీర్పు కోరాలని డిమాండ్‌ చేశారు.

Untitled Document
Advertisements