సిరియాకు ట్రంప్‌ షాక్

     Written by : smtv Desk | Sun, Apr 01, 2018, 03:27 PM

సిరియాకు ట్రంప్‌ షాక్

వాషింగ్టన్‌, ఏప్రిల్ 1: అంతర్యుద్ధంతో అతలాకుతలమైన సిరియాకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ పెద్ద షాక్ ఇచ్చారు. భారీ ఆర్థిక సాయాన్ని నిలిపివేస్తున్నట్లు ఆయన ప్రకటించారు. ఈ మేరకు శనివారం ట్రెజరీ విభాగానికి ఆయన ఆదేశాలు జారీచేశారు.

తాజాగా సిరియా నుంచి తమ బలగాలు వెనక్కి తీసుకోవాలని అమెరికా నిర్ణయించింది. ఈ నేపథ్యంలో కొద్ది రోజుల క్రితం ప్రకటించిన ఆర్థిక సాయాన్ని కూడా నిలిపివేస్తున్నట్లు తెలిపింది. దీంతో సుమారు 200 మిలియన్‌ డాలర్ల ఆర్థిక సాయాన్ని నిలిపివేసినట్లు ట్రెజరీ శాఖ పేర్కొంది. ఫిబ్రవరిలో కువైట్‌ పర్యటన సందర్భంగా అమెరికా విదేశాంగ మంత్రి రెక్స్‌ టిల్లర్‌సన్‌.. సిరియా పునర్మిణానికి ఆ భారీ ఆర్థిక సాయ ప్రకటన చేశారు. దాడుల్లో విధ్వంసం అయిన ప్రాంతాల్లో మౌళిక సదుపాయాల నిర్మాణం కోసం వీటిని వెచ్చించనున్నట్లు టిల్లర్‌సన్‌ ఆ సమయంలో ప్రకటించారు.





Untitled Document
Advertisements