మీడియా కథనాలపై.. చైనా సీరియస్‌

     Written by : smtv Desk | Mon, Apr 02, 2018, 04:42 PM

మీడియా కథనాలపై.. చైనా సీరియస్‌

బీజింగ్‌, ఏప్రిల్ 2: స్కైల్యాబ్ స్పేస్ స్టేషన్ కూలిపోవటంపై గత రెండు రోజులుగా ప్రపంచ మీడియాలో వస్తున్న కథనాలపై చైనా తీవ్ర౦గా మండిపడింది. ఆగ్రహం వ్యక్తం చేసింది. ఏరో స్పేస్‌ రంగంలో చైనా ఎదుగుదలను భరించలేక బురద జల్లుతు.. మీడియా ఛానెళ్లు అతిగా ప్రదర్శించాయంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది.

‘అదొక సాధారణ స్పేస్‌క్రాఫ్ట్‌. అయినా కూలిపోతే ఏదో విపత్తు సంభవిస్తుందన్న స్థాయిలో అధిక ప్రాధాన్యం ఇస్తూ అంతర్జాతీయ మీడియా ఛానెళ్లు కథనాలు ప్రచురించాయి. చైనా అంతరిక్ష రంగాన్ని దెబ్బతీసేందుకే ఇలాంటి చర్యలకు పాల్పడ్డాయి. కొందరైతే అది ఎక్కడ కూలిపోతుందో చెబుతూ ప్రజల్లో భయాందోళనలు రేకెత్తించారు’ అంటూ చైనా అధికారిక పత్రిక గ్లోబల్‌ టైమ్స్‌ పేర్కొంది.





Untitled Document
Advertisements