యూట్యూబ్‌ ఆఫీస్ వద్ద మహిళ కాల్పులు

     Written by : smtv Desk | Wed, Apr 04, 2018, 11:36 AM

యూట్యూబ్‌ ఆఫీస్ వద్ద మహిళ కాల్పులు

వాషింగ్టన్, ఏప్రిల్ 4‌: అమెరికాలోని శాన్‌బ్రూన్‌లో గల యూట్యూబ్‌ ప్రధాన కార్యాలయం వద్ద ఓ మహిళ కాల్పులకు తెగబడింది. ఈ ఘటనలో నలుగురు గాయపడ్డారు. అనంతరం ఆమె తనను తాను కాల్చుకుని ఆత్మహత్యకు పాల్పడింది. కాల్పుల శబ్దంతో కార్యాలయంలోని ఉద్యోగులు పరుగులు తీశారు. మొత్తం 10రౌండ్లు తుపాకీ కాల్పులు జరిగాయి.

అమెరికా కాలమానం ప్రకారం మంగళవారం మధ్యాహ్నం ఈ ఘటన చోటుచేసుకుంది. గాయపడిన వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు ఓ మహిళ మృతదేహాన్ని గుర్తించారు. కాల్పులకు పాల్పడిన మహిళే ఆత్మహత్యకు పాల్పడి ఉంటుందని వారు భావిస్తున్నారు. యూట్యూబ్‌ ప్రధాన కార్యాలయంలో మొత్తం 1,700 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. క్షతగాత్రులను శాన్‌ఫ్రాన్సిస్కోలోని ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై స్పందించిన అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ సకాలంలో స్పందించి బాధితులను ఆదుకున్న అధికారులను అభినందించారు.





Untitled Document
Advertisements