చంద్రబాబుతో భేటీ అయిన కేజ్రీవాల్‌

     Written by : smtv Desk | Wed, Apr 04, 2018, 03:31 PM

చంద్రబాబుతో భేటీ అయిన కేజ్రీవాల్‌

న్యూఢిల్లీ, ఏప్రిల్ 4: ఢిల్లీ పర్యటనలో భాగంగా ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుతో దిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ బుధవారం భేటీ అయ్యారు. ఈరోజు ఉదయం ఏపీ భవన్‌కు వచ్చిన కేజ్రీవాల్‌ చంద్రబాబుతో సమావేశమై కేంద్ర ప్రభుత్వ పనితీరు పై చర్చించారు.

మోదీ సర్కార్‌ఫై కేజ్రీవాల్‌ మొదటి నుంచీ వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రాల హక్కులు, అధికారాలు, నిధుల విషయంలో కేంద్రం తీరుపై ఆయన తరుచూ మండిపడుతుంటారు. అయితే చంద్రబాబు ఎన్డీయే కూటమిలో ఉన్నంత కాలం కేజ్రీవాల్‌ ఆయనతో ఎన్నడూ భేటి కాలేదు. కానీ ఇటీవల ఎన్డీయే కూటమి నుంచి తెదేపా వైదొలగడం, ఏపీకి ప్రత్యేక హోదా పై కేంద్రంతో పోరాటం సాగిస్తున్న నేపథ్యంలో కేజ్రీవాల్‌.. చంద్రబాబుతో భేటీ కావడం ప్రాధాన్యత సంతరించుకుంది.

Untitled Document
Advertisements