తాగిన మత్తులో భారతీయ విద్యార్థులపై దాడి

     Written by : smtv Desk | Wed, Apr 04, 2018, 05:15 PM

తాగిన మత్తులో భారతీయ విద్యార్థులపై దాడి

మనీలా, ఏప్రిల్ 4: ఫిలిప్పీన్స్‌లో ఎంబీబీఎస్‌ విద్యనభ్యసిస్తన్న భారతీయ విద్యార్థులపై తాగిన మత్తులో ముగ్గురు స్థానికులు దాడికి పాల్పడ్డారు. గుంటూరుకు చెందిన అనురాగ్‌ నాయుడుతోపాటూ, విజయవాడకు చెందిన అఖిల్‌ గారపటిపై దాడి చేశారు. ఈ దాడిలో అనురాగ్‌ నాయుడు కంటికి గాయం అయ్యింది. అనురాగ్‌ నాయుడు కొసానా బికాల్‌లో అల్బే లిగాజ్పీ నగరంలోని అమెక్‌ బీసీసీఎమ్ లో ఎంబీబీఎస్‌ ప్రథమ సంవత్సరం చదువుతున్నారు.
అనురాగ్‌ పోలీసులకు ఫిర్యాదు చేయగా, వారు బనాడెరో బ్రాంగే( అక్కడి స్థానిక ప్రతినిధి)ని సంప్రదించాలని చెప్పారని తెలిపారు. అక్కడికి వెళ్లినాకూడా తమకు న్యాయం జరగలేదని, ప్రస్తుతం కేసు విచారణలో ఉందన్నారు.


Untitled Document
Advertisements