'పల్సర్ 135' ఇక రాదు

     Written by : smtv Desk | Fri, Apr 06, 2018, 04:49 PM

 'పల్సర్ 135' ఇక రాదు

ముంబై, ఏప్రిల్ 6 ‌: వాహనప్రియులకు బజాజ్ నుండి వచ్చే పల్సర్ ద్విచాక్రవాహనలంటే చాలా ఇష్టంగా కొనుగోలు చేస్తారు. కానీ ఆ సంస్థ ప్రస్తుతం విపణిలో ఆదరణలో ఉన్న పల్సర్‌ 135సీసీ’ మోడల్‌ను ఉపసంహరించాలని నిర్ణయించింది. ఇందుకు కారణం కేంద్రప్రభుత్వం తెచ్చిన తాజా నిర్ణయం ప్రకారం 2019 ఏప్రిల్‌ నాటికి 125 సీసీ లేదా అంతకంటే ఎక్కువ సీసీ ఉన్న ద్విచక్రవాహనాలకు కనీసం సింగిల్‌ ఛానెల్‌ ఏబీఎస్‌(యాంటీ లాక్‌ బ్రేకింగ్‌ సిస్టమ్‌) ఉండి తీరాలి.

బజాజ్‌ లక్ష కంటే తక్కువ ధర కలిగిన పల్సర్‌ మోడళ్లలో ఇంకా ఏబీఎస్‌ ఫీచర్‌ను ప్రవేశపెట్టలేదు. అయితే వచ్చే ఏడాది ఏప్రిల్ నుంచి ప్రతి పల్సర్‌ మోడల్‌కు ఏబీఎస్‌ ఫీచర్‌ అందుబాటులోకి వస్తుంది. అత్యంత ఆదరణ పొందిన పల్సర్‌ 150సీసీకి కొద్ది మార్పులతో ఈ ‘బేబీ పల్సర్‌’ను సంస్థ తయారుచేసింది.

ఏబీఎస్‌ అంటే..
ద్విచక్రవాహనంపై వెళ్తున్నపుడు కొన్ని సందర్భాల్లో అకస్మాత్తుగా బ్రేక్‌ వేయాల్సి వస్తుంది. ఇలాంటప్పుడు అదుపుతప్పి కిందపడిపోవడం లేదా సరిగ్గా బ్రేక్‌ పడని కారణంగా మరో వాహనాన్ని ఢీకొట్టి ప్రమాదాలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్రం 125సీసీ లేదా అంతకంటే ఎక్కువ సీసీ ఉన్న ద్విచక్రవాహనాలకు కనీసం సింగిల్‌ ఛానెల్‌ ఏబీసీ ఉండి తీరాలని నిబంధన తీసుకొచ్చింది. ఏబీఎస్‌ వల్ల ఉపయోగాలేంటో ఈ కింది వీడియో చూసి తెలుసుకోండి.





Untitled Document
Advertisements