సల్మాన్ కు బెయిల్ మంజూరు

     Written by : smtv Desk | Sat, Apr 07, 2018, 03:50 PM

సల్మాన్ కు బెయిల్ మంజూరు

జోధ్‌పూర్‌‌, ఏప్రిల్ 7: కృష్ణ జింకల వేట కేసులో బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ కు ఊరట లభించింది. రూ.50 వేల వ్యక్తిగత పూచీకత్తుపై జోధ్‌పూర్‌ సెషన్స్ కోర్టు సల్మాన్ కు శనివారం బెయిల్ మంజూరు చేసింది. బెయిల్ ఉత్తర్వులను జైలు అధికారులు పరీశీలించిన అనంతరం సల్మాన్ ని విడుదల చేయవచ్చని సీనియర్ న్యాయవాది భరత్ భూషణ్ శర్మ తెలిపారు. ఈ కేసులో సల్మాన్ ఖాన్ కు ఐదేళ్ల జైలు శిక్ష విధిస్తూ కోర్టు తీర్పు ఇచ్చింది. దీంతో జోథ్ పూర్ సెంట్రల్ జైలులో బాలీవుడ్ హీరో రెండు రోజులు గడిపాడు.

Untitled Document
Advertisements