హోటల్‌లో అగ్నిప్రమాదం..రూ.10లక్షలు ఆస్తినష్టం

     Written by : smtv Desk | Sun, Apr 08, 2018, 06:02 PM

హోటల్‌లో అగ్నిప్రమాదం..రూ.10లక్షలు ఆస్తినష్టం

హైదరాబాద్, ఏప్రిల్ 8‌:హైదరాబాద్ ఎల్బీనగర్‌లోని సితార గ్రాండ్‌ హోటల్‌లో ఆదివారం తెల్లవారుజామున అగ్నిప్రమాదం సంభవించింది. డెకరేషన్‌ లైట్స్‌ షార్ట్‌ సర్క్యూట్‌ కారణంగా పెద్దఎత్తున మంటలు చెలరేగాయి. మంటలు మూడో అంతస్తు వరకూ వ్యాపించడంతో హోటల్‌ ముందున్న ఫ్లెక్సీలు, ఏసీ పరికరాలు, డెకరేషన్‌ లైట్లు అగ్నికి ఆహుతయ్యాయి. సమాచారం అందుకున్న ఎల్బీనగర్‌ పోలీసులు, అగ్నిమాపక దళాలు ఘటనాస్థలికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చారు. ఈ ప్రమాదంలో సుమారు రూ.10లక్షలు ఆస్తినష్టం జరిగి ఉండవచ్చని పోలీసులు అంచనా వేస్తున్నారు.

Untitled Document
Advertisements