గోప్యత కావాలంటే నగదు కట్టాల్సిందేనా..!

     Written by : smtv Desk | Tue, Apr 10, 2018, 12:27 PM

గోప్యత కావాలంటే నగదు కట్టాల్సిందేనా..!

వాషింగ్టన్‌, ఏప్రిల్ 10 : ఫేస్ బుక్.. ప్రస్తుత తరానికి పరిచయం అక్కరలేని పేరు. సాంకేతికత అందుబాటులోకి వచ్చిన తర్వాత దీని వాడకం విచ్చలవిడిగా పెరిగిపోయింది. ఎవరి మానాన వారు బతుకుతున్న ప్రపంచ ప్రజలకు సరికొత్త అనుభూతిని అందించిన ఫేస్ బుక్ కు చాలా తక్కువ వ్యవధిలోనే జనాలు అలవాటు పడిపోయారు.

ఫేస్ బుక్ సంస్థ లో ఇటీవల డేటా చౌర్యం జరిగిన విషయం తెలిసిందే. ఇదే విషయంపై ఆ సంస్థ అధినేత జుకర్ బర్గ్ వినయోగాదారులకు క్షమాపణలు కూడా చెప్పారు. అయితే తాజాగా పేస్ బుక్ యూజర్లకు షాక్ ఇచ్చే వార్త చెప్పింది. అదేంటంటే.. వ్యక్తిగత సమాచారం భద్రంగా ఉండాలంటే కొంత మొత్తాన్ని సంస్థకు చెల్లించాలని ఆ సంస్థ చీఫ్‌ ఆపరేటింగ్‌ ఆఫీసర్‌ షెరిల్‌ శాండ్‌ బర్గ్‌ అభిప్రాయపడ్డారు.

వినియోగదారులు తమ వ్యక్తిగత గోప్యత కాపాడుకోవాలని భావిస్తే.. కొంత మొత్తాన్ని ఫేస్ బుక్ కు కడితే.. యూజర్ల వాల్ పై ఎలాంటి యాడ్స్ రావని ఆమె స్పష్టం చేశారు. ఇప్పటికి అయితే దీనికి సంబంధించి ఎలాంటి రుసుము వసూలు చేయనప్పటికీ.. రానున్న రోజుల్లో ఈ చెల్లింపుల ప్రక్రియ తెర మీదకు వచ్చినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని చెప్పాలి.





Untitled Document
Advertisements