ఏపీ స్పీకర్‌కు హైకోర్టు నోటీసులు

     Written by : smtv Desk | Tue, Apr 10, 2018, 02:51 PM

ఏపీ స్పీకర్‌కు హైకోర్టు నోటీసులు

హైదరాబాద్‌, ఏప్రిల్ 10: ఆంధ్రప్రదేశ్‌లో పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాలని ప్రతిపక్ష పార్టీ గతంలో స్పీకర్‌ దృష్టికి తీసుకెళ్ళింది. ప్రతిపక్ష పార్టీ నుంచి అధికార పార్టీలోకి ఫిరాయించిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలంటూ దాఖలైన పిటిషన్‌పై ఉమ్మడి హైకోర్టు మంగళవారం విచారణ చేపట్టింది. నలుగురు మంత్రులు సహా మొత్తం 19మంది ఫిరాయింపు ఎమ్మెల్యేలపై గతంలోనే ఏపీ స్పీకర్‌ కోడెల శివప్రసాద్‌రెడ్డికి ఫిర్యాదు చేసినా.. స్పీకర్‌ వారిపై ఎలాంటి చర్యలు తీసుకోలేదని న్యాయవాది పొన్నవోలు సుధాకర్‌రెడ్డి హైకోర్టు దృష్టికి తీసుకొచ్చారు. వాదనలు విన్న న్యాయస్థానం.. మూడు వారాల్లో కౌంటర్‌ దాఖలు చేయాలని స్పీకర్‌కు నోటీసులు జారీచేసింది.

Untitled Document
Advertisements