సీఎం క్యాంప్ ఆఫీస్ వద్ద రైతు ఆత్మహత్యాయత్నం

     Written by : smtv Desk | Tue, Apr 10, 2018, 03:58 PM

 సీఎం క్యాంప్ ఆఫీస్ వద్ద రైతు ఆత్మహత్యాయత్నం

పంజాగుట్ట, ఏప్రిల్ 10: సీఎం క్యాంప్‌ కార్యాలయం వద్ద ఓ రైతు మంగళవారం ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. సూర్యాపేట జిల్లా పుప్పాలగూడ గ్రామానికి చెందిన సైదులు(24) అనే రైతు పంట కోస౦ చేసిన అప్పులు పెరగడంతో తన సమస్యను విన్నవించుకోవడానికి సీఎం కార్యాలయానికి వచ్చాడు. కార్యాలయంలోకి వెళ్లడానికి ప్రయత్నించగా సెక్యూరిటీ సిబ్బంది అనుమతించలేదు. దీంతో మనస్తాప౦ చెంది పురుగుల మందును తాగి ఆత్మహత్యాయత్నం చేశాడు. ఇది గమనించిన సెక్యూరిటీ సిబ్బంది అప్రమత్తమై సైదులును చికిత్స నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు.

Untitled Document
Advertisements