ఏయూ వెబ్‌సైట్‌ హ్యాక్‌..

     Written by : smtv Desk | Tue, Apr 10, 2018, 06:28 PM

 ఏయూ వెబ్‌సైట్‌ హ్యాక్‌..

విశాఖపట్నం, ఏప్రిల్ 10: ఆంధ్రా యూనివర్శిటీ వెబ్‌సైట్‌ మంగళవారం హ్యాక్‌కు గురైంది. దీంతో ఒక్కసారిగా యూనివర్శిటీలో కలకలం రేగింది. andhrauniversity.edu.in వెబ్‌సైట్‌ ఓపెన్‌ చేయగానే ఏవో సందేశాలు కనిపించడంతో వర్శిటీ అధికారులు అప్రమత్తమయ్యారు. ఇది పాక్‌ ఉగ్రవాదుల పనే అని ప్రచారం జరగడంతో అధికారులు దర్యాప్తు చేపట్టారు. ఎవరో ఆకతాయిలే ఈ చర్యకు పాల్పడి ఉండొచ్చని అనుమానిస్తున్నారు. విశ్వవిద్యాలయ సాంకేతిక సిబ్బంది వెబ్‌సైట్‌ హ్యాకింగ్‌కి గురికాకుండా ఫైర్‌వాల్స్ నిర్మించే పనిలో ఉన్నారని ఉపకులపతి ఆచార్య నాగేశ్వరరావు వెల్లడించారు. వెబ్‌సైట్ హ్యాక్ కావడంతో అన్‌లైన్ సేవలన్నీ నిలిచిపోయాయి.

Untitled Document
Advertisements