రాజు అనిపించుకున్న రాకుమారుడు..!

     Written by : smtv Desk | Tue, Apr 10, 2018, 06:39 PM

రాజు అనిపించుకున్న రాకుమారుడు..!

బ్రిటన్, ఏప్రిల్ 10 : బ్రిటన్‌ రాకుమారుడు అయిన ప్రిన్స్‌ హ్యారీ.. ప్రముఖ హాలీవుడ్‌ నటి మేగన్‌ మార్కెల్‌ త్వరలో మనువాడనున్నారు. మే 19న హ్యారీ, మార్కెల్‌ వివాహం బ్రిటన్‌లోని విండ్సర్‌ రాయల్‌ హౌస్‌లో జరగనుంది. అయితే వారి పెళ్లికి వచ్చే కానుకలన్నీ ఏడు స్వచ్ఛంద సంస్థలకు విరాళంగా ఇవ్వాలని హ్యారీ, మార్కెల్‌ లు నిర్ణయించుకున్నారు.

వాటిలో ముంబయిలోని 'మైనా మహిళా' అనే స్వచ్ఛంద సంస్థ కూడా ఉంది. గతేడాది మార్కెల్ ఈ ఫౌండేషన్‌ను సందర్శించి.. అక్కడి మహిళలు చేసే పనుల గురించి తెలుసుకున్నారు. ప్రిన్స్‌ హ్యారీ, మేగన్‌ తమ ఛారిటీని ఎంపిక చేసుకున్నందుకు ఫౌండేషన్‌ వ్యవస్థాపకురాలు సుహాని జలోటా ఎంతో సంతోషంగా ఉందని తెలిపారు.

వారు అందించే సాయంతో తమ సంస్థను మరింత అభివృద్ధి చేసి.. మరికొందరు మహిళలకు ఉద్యోగాలు ఇప్పిస్తామని వెల్లడించారు. ప్రిన్స్‌ హ్యారీ ఎంపికచేసుకున్న ఛారిటీల్లో క్రైసిస్‌, స్కాటీస్‌ లిటిల్‌ సోల్జర్స్‌, స్ట్రీట్‌ గేమ్స్‌, సర్ఫర్స్‌ ఎగనెస్ట్‌ సివేజ్‌, చివా, ది వైల్డర్‌నెస్‌ ఫౌండేషన్లు ఉన్నాయి.





Untitled Document
Advertisements