పోలీసు పహారాలో మంగళగిరి

     Written by : smtv Desk | Wed, Apr 11, 2018, 12:28 PM

పోలీసు పహారాలో మంగళగిరి

మంగళగిరి,ఏప్రిల్ 11: ఒకవైపు ఆనంద నగరాల సదస్సు, మరో వైపు జగన్‌ ప్రజాసంకల్ప పాదయాత్ర తో మంగళగిరి వీధులన్నీ పోలీసుల దిగ్భందంలో ఉన్నాయి. సీకే కన్వెన్షన్‌ హాలులో ప్రారంభమైన అంతర్జాతీయ ఆనంద నగరాల సదస్సుకు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు హాజరయ్యారు. మరో వైపు ప్రతిపక్ష నేత, వైకాపా అధ్యక్షుడు జగన్మోహనరెడ్డి పాదయాత్ర చేస్తూ మంగళగిరికి వచ్చారు. బుధవారం ఉదయం వరకు ఆయన ఇక్కడే ఉంటారు. ఇరువురు నాయకుల కార్యక్రమాలతో పట్టణంలో పోలీసు భద్రత కట్టుదిట్టం చేశారు.

ఉదయం నుంచి పట్టణంలో ట్రాఫిక్‌ నిబంధనలు అమలు చేశారు. ఇలా ఉండగా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సీకే కన్వెన్షన్‌ హాలులో మధ్యాహ్నం మూడు గంటల వరకు సదస్సులో పాల్గొన్నారు. ఈ సందర్భంగా గుంటూరు అర్బన్‌ ఎస్పీ సీహెచ్‌.విజయరావు పర్యవేక్షణలో విస్తృత బందోబస్తు ఏర్పాటు చేశారు. వందల మంది పోలీసుల పహారాలో మంగళగిరి పరిసరాలు ఉండి పోయాయి. జాతీయ రహదారి పక్కన సర్వీసు రహదారి మీదుగా విజయవాడ వెళ్లే దారితో పాటు, మంగళగిరిలోకి వచ్చే పలు మార్గాల్లో ట్రాఫిక్‌ ఆంక్షలు అమలు చేశారు.

Untitled Document
Advertisements