వీహెచ్ ను అడ్డుకోవడంతో ఘర్షణ..

     Written by : smtv Desk | Wed, Apr 11, 2018, 04:51 PM

వీహెచ్ ను అడ్డుకోవడంతో ఘర్షణ..

హైదరాబాదు, ఏప్రిల్ 11: అంబర్‌పేట్ అలీకేఫ్ చౌరస్తాలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. జ్యోతిరావు పూలే జయంతి వేడుకల్లో పాల్గొనేందుకు కాంగ్రెస్ సీనియర్ నేత వీహెచ్ వచ్చారు. అయితే వీహెచ్‌ను ఉత్సవ కమిటీ సభ్యులు అడ్డుకున్నారు. దీంతో వీహెచ్ అనుచరులు, సీపీఎం కార్యకర్తల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది.

ఈ సందర్భంగా, పూలే అందరివాడని, నివాళులర్పించేందుకు వచ్చిన తనపై వీహెచ్‌ అనుచరులు దాడి చేశారంటూ ఎంబీసీ నేత ఆశయ్య పోలీసులకు ఫిర్యాదు చేశారు. అంబర్ పేటకు తాము రావడాన్ని వారు జీర్ణించుకోలేకపోయారని ఆయన తెలిపారు. దీనిపై వీహెచ్ అనుచరులు మండిపడ్డారు. వీహెచ్ ను అవమానించేలా మాట్లాడారని ఆరోపిస్తూ, పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఇరువర్గాల ఫిర్యాదులు స్వీకరించిన పోలీసులు, కేసులు నమోదు చేసి, దర్యాప్తు ప్రారంభించారు.

Untitled Document
Advertisements