కాళేశ్వరం ప్రాజెక్టుపై ఎన్జీటీలో విచారణ

     Written by : smtv Desk | Wed, Apr 11, 2018, 05:39 PM

 కాళేశ్వరం ప్రాజెక్టుపై ఎన్జీటీలో విచారణ

న్యూఢిల్లీ, ఏప్రిల్ 11: తెలంగాణ ప్రభుత్వం నిర్మిస్తున్న అత్యంత భారీ ప్రాజెక్టు కాళేశ్వరంపై ఎన్జీటీ(నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్)లో విచారణ జరిగింది. ప్రాజెక్టుకు సంబంధించి దాఖలైన పిటిషన్లపై కమిషన్ ఏర్పాటు చేయాలంటూ ఎన్జీటీలో పిటిషన్ దాఖలైంది. దీనిపై బుధవారం విచారణ జరిపిన ధర్మాసనం.. కమిషన్ ఏర్పాటు చేయాలన్న పిటిషనర్ తరఫు న్యాయవాది వాదనలతో ఏకీభవించలేదు. అనంతరం విచారణను మే 10కి వాయిదా వేసింది. మరోవైపు, కాళేశ్వరం ప్రాజెక్టును ప్రభుత్వ యంత్రాంగం పరుగులుపెట్టిస్తోంది. వీలైనంత త్వరగా పూర్తి చేసేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నారు.

Untitled Document
Advertisements