ఎంపీ దత్తాత్రేయ నిరాహారదీక్ష

     Written by : smtv Desk | Thu, Apr 12, 2018, 12:13 PM

ఎంపీ దత్తాత్రేయ నిరాహారదీక్ష

హైదరాబాద్, ఏప్రిల్ 12: పార్లమెంట్‌ సమావేశాలను విపక్షాలు అడ్డుకోవడాన్ని నిరసిస్తూ ఒకరోజు నిరాహారదీక్ష చేపడుతున్నట్లు సికింద్రాబాద్‌ ఎంపీ బండారు దత్తాత్రేయ తెలిపారు. ఢిల్లీలో బీజేపీ చెపట్టిన దీక్షకు మద్దతుగా ఖైరతాబాద్‌లోని శ్రీధర్‌ ఫంక్షన్‌ హాల్‌లో గురువారం ఆయన శాంతియుతంగా నిరాహార దీక్షలో కూర్చున్నారు. ఈ సందర్బంగా దత్తాత్రేయ విలేకరులతో మాట్లాడుతూ... పార్లమెంట్‌ను అడ్డుకోవడం అంటే ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడమేనన్నారు. అనేక సంవత్సరాల్లో జరగని అభివృద్ధి నాలుగు సంవత్సరాలలో బీజేపీ చేపట్టిందనన్నారు. ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించడానికి శాంతియుతంగా నిరాహారదీక్ష దీక్ష చేపడుతున్నట్లు దత్తాత్రేయ తెలిపారు

Untitled Document
Advertisements