ఎంబీఏ విద్యార్థిని అదృశ్యం

     Written by : smtv Desk | Thu, Apr 12, 2018, 12:34 PM

ఎంబీఏ విద్యార్థిని అదృశ్యం

హైదరాబాద్, ఏప్రిల్ 12: నగరంలో ఎంబీఏ చదువుతున్న ఓ విద్యార్ధిని అదృశ్యమైంది. మీర్‌పేట్ కేశవరెడ్డి నగర్‌కు చెందిన నిఖిత(21) అనే విద్యార్ధిని ఎంబీఏ మొదటి సంవత్సరం చదువుతోంది. అయితే.. ఆమె కాలేజీకి వెళ్లి తిరిగి ఇంటికి రాలేదు. దీంతో కంగారుపడిన తల్లిదండ్రులు ఎక్కడ వెతికినా ఆచూకి లభించకపోవడంతో పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు..

Untitled Document
Advertisements