ఆ పిల్‌పై విచారణ చేపట్టను: జాస్తి చలమేశ్వర్‌

     Written by : smtv Desk | Thu, Apr 12, 2018, 01:05 PM

ఆ పిల్‌పై విచారణ చేపట్టను:  జాస్తి చలమేశ్వర్‌

న్యూఢిల్లీ, ఏప్రిల్ 12: భారత ప్రధాన న్యాయమూర్తి సుప్రీంకోర్టులో సీనియర్‌ న్యాయమూర్తిగా ఉన్న జస్టిస్‌ జాస్తి చలమేశ్వర్‌ శాంతి భూషణ్‌ దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని(పిల్) విచారించేందుకు తిరస్కరించారు. సుప్రీం కోర్టు ప్రధానన్యాయమూర్తికి ఉండే అధికారాలను ప్రశ్నిస్తూ ప్రముఖ న్యాయవాది శాంతి భూషణ్‌ దాఖలు చేసిన పిల్‌ను విచారించేందుకు విముఖత వ్యక్తం చేశారు. త్వరలో రిటైర్‌ అవుతున్నందనే తాను పిల్‌ను స్వీకరించడం లేదని తెలిపారు. తర్వాత ఈ వ్యాజ్యాన్ని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ దీపక్‌మిశ్రా దృష్టికి పిటిషనర్‌ తీసుకెళ్లారు. ఈ అంశాన్ని పరిశీలిస్తామని ప్రధాన న్యాయమూర్తి వెల్లడించారు.

ఈ ఏడాది జనవరిలో సుప్రీం కోర్టులో పరిపాలన వ్యవస్థ సరిగా లేదని నలుగురు సీనియర్‌ న్యాయమూర్తులు మీడియా ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. జస్టిస్‌ జాస్తి ఛలమేశ్వర్‌, జస్టిస్‌ రంజన్‌ గొగోయ్‌, జస్టిస్‌ మదన్‌ బి లోకూర్‌, జస్టిస్‌ కురియన్‌ జోసఫ్‌లు మీడియా సమావేశం ఏర్పాటుచేసి సీజేఐపై అసంతృప్తి వ్యక్తం చేయడం సంచలనంగా మారింది.





Untitled Document
Advertisements