ఈ నెల 16న ఏపీ బంద్!

     Written by : smtv Desk | Thu, Apr 12, 2018, 03:03 PM

ఈ నెల 16న ఏపీ బంద్!

అమరావతి, ఏప్రిల్ 12: ఏపీ కి ప్రత్యక హోదా సాధన కోసం చేపడుతున్న నిరసనల్లో భాగంగా ఈనెల 16వతేదీన ఏపీ బంద్‌కు వామపక్ష పార్టీలు, ప్రత్యేక హోదా సాధన సమితి పిలుపునిచ్చింది. ఈమేరకు ప్రత్యేక హోదా సాధన సమితి నాయకుడు చలసాని శ్రీనివాస్ గురువారం విలేకరులతో మాట్లాడుతూ... 16వతేదీన బంద్‌కు పిలుపునిస్తున్నామని, అయితే... అత్యవసర సేవలకు బంద్ నుంచి మినహాయింపునిస్తున్నామన్నారు. అలాగే ‘బంద్‌లు చేయాలని మా‌కు కోరిక కాదు... ప్రజల కోసం రోడ్డెక్కుతున్నాం..’ అని ఆయన అన్నారు. పార్లమెంట్‌లో కేంద్ర ప్రభుత్వ తీరుకు నిరసనగా చేపట్టనున్న బంద్ లో ప్రతి ఒక్కరూ స్వచ్ఛందంగా పాల్గొని విజయవంతం చేయాలని హోదా సాధన సమితి పిలుపునిచ్చింది.

Untitled Document
Advertisements