పాఠశాల పర్యవేక్షణకు 'టీఎస్‌ స్కూల్'

     Written by : smtv Desk | Thu, Apr 12, 2018, 03:29 PM

పాఠశాల పర్యవేక్షణకు 'టీఎస్‌ స్కూల్'

హైదరాబాద్, ఏప్రిల్ 12‌: పాఠశాలల్లో పర్యవేక్షణ కొరకు విద్యాశాఖ మొబైల్‌ యాప్‌ను అందుబాటులోకి తెచ్చింది. పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు, విద్యా కార్యక్రమాల అమలును ఎప్పటికప్పుడు తెలుసుకుని, అవసరమైన చర్యలు చేపట్టేందుకు బుధవారం విద్యాశాఖ ‘టీఎస్‌ స్కూల్‌’ పేరుతో మొబైల్‌ యాప్‌ను విడుదల చేసింది. ప్రతీ పాఠశాలలకు జియోఫెన్సింగ్‌ను ఏర్పాటు చేసింది. దీంతో క్లస్టర్‌ రీసోర్స్‌ పర్సన్స్‌ (సీఆర్‌పీ) పాఠశాలకు వెళ్తేనే యాప్‌ ఓపెన్‌ అవుతుంది. సీఆర్‌పీలు పాఠశాలలకు వెళ్లి అక్కడి నుంచే టీచర్ల హాజరు, విద్యార్థుల మధ్యాహ్న భోజన పథకం అమలు వంటి వివరాలను యాప్‌ ద్వారా అప్‌లోడ్‌ చేయాల్సి ఉంటుంది.





Untitled Document
Advertisements