రేపు బెంగళూరు వెళ్ళనున్న కేసీఆర్‌!

     Written by : smtv Desk | Thu, Apr 12, 2018, 06:03 PM

రేపు బెంగళూరు వెళ్ళనున్న కేసీఆర్‌!

హైదరాబాద్, ఏప్రిల్ 12‌: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ రేపు బెంగళూరు వెళ్లనున్నారు. దేశ రాజకీయాల్లో గుణాత్మక మార్పు లక్ష్యంతో వివిధ రాజకీయ పార్టీలతో సమావేశమవుతున్న కేసీఆర్‌ రేపు ఉదయం మాజీ ప్రధాని దేవెగౌడతో భేటీ కానున్నారు.

దేశంలో ప్రత్యామ్నాయ రాజకీయ వేదిక ఏర్పాటు ప్రక్రియ దిశగా ఇటీవల కేసీఆర్‌ కోల్‌కతా వెళ్లి పచ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీతో చర్చించారు. శుక్రవారం ఉదయం 9.45 గంటలకు బేగంపేట విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో కేసీఆర్‌ బెంగళూరు వెళ్లనున్నారు. దేశ రాజకీయాలపై చర్చించిన అనంతరం రేపు సాయంత్రం 5 గంటలకు సీఎం హైదరాబాద్‌ చేరుకుంటారు.

.

Untitled Document
Advertisements