అంగన్‌వాడీ కేంద్రాలకు ఒంటిపూట

     Written by : smtv Desk | Thu, Apr 12, 2018, 06:54 PM

అంగన్‌వాడీ కేంద్రాలకు ఒంటిపూట

నల్లగొండ, ఏప్రిల్ 12: వేసవి కాలంలో పగటిపూట పెరుగుతున్న ఉష్ణోగ్రతలను దృష్టిలో పెట్టుకుని అంగన్‌వాడీ కేంద్రాలను ఒంటిపూట నిర్వహించా లని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. పాఠశాలలకు ఈ నెల 13 నుంచి వేసవి సెలవులు ఇస్తున్న నేపథ్యంలో అంగన్‌వాడీ కేంద్రాలకు ఈవెసులుబాటు కల్పించారు. ఉష్ణోగ్రతల్లో చోటుచేసుకుంటున్న మార్పుల వల్ల కేంద్రాల్లో పిల్లలు ఉక్కపోతతో అల్లాడిపోతున్నారు.

ఈ క్రమంలో సాధ్యాసాధ్యాలను పరిశీలించిన మహిళా, శిశు సంక్షేమశాఖ.. అంగన్‌వాడీ కేంద్రాలను ఈ నెల 13 నుంచి వచ్చే నెల 31 వరకు ఒక్కపూటమాత్రమే నిర్వహించాలని ఉత్తర్వులు జారీ చేశారు. ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు నిర్వహించాలని ఉత్తర్వులు జారీ చేసింది. ఒంటిపూట సమయంలోనే చిన్నారులకు పౌష్టికాహారం అందించాలి. మధ్యాహ్నం 12 గంటల తర్వా త పౌష్టికాహారం అందించి ఇంటికి పంపాలి. కేంద్రాల వద్ద వేసవి జాగ్రత్తలు తీసుకోవాలని, నిర్వహణ పకడ్బందీగా ఉండేలా తగిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం సూచించింది.

Untitled Document
Advertisements