ఆయుష్మాన్ భారత్ ను ప్రారంభించనున్న మోదీ

     Written by : smtv Desk | Thu, Apr 12, 2018, 06:59 PM

 ఆయుష్మాన్ భారత్ ను ప్రారంభించనున్న మోదీ

న్యూఢిల్లీ, ఏప్రిల్ 12 : కేంద్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా వెల్లడించిన 'ఆయుష్మాన్ భారత్' పథకాన్ని ప్రధాని నరేంద్రమోదీ ఈనెల 14న ఆరంభించానున్నారు. దేశంలోనే మొదటి కేంద్రాన్ని ఛత్తీస్‌గఢ్‌లోని బిజాపూర్‌లో ప్రారంభిస్తారు. రియల్‌ టైమ్‌ మానిటరింగ్‌ కింద తొలుత 150 జిల్లాల్లో ఈ పథకాన్ని అమలు చేస్తారు. ఈ పథకం కింద దారిద్ర్య రేఖ(బీపీఎల్)కు దిగువన ఉన్న ఒక్కో కుటుంబానికి గరిష్ఠంగా రూ. 5లక్షల వరకూ వైద్య సేవలు పొందడానికి వెసులుబాటు ఉంటుంది.

ఆయుష్మాన్‌ భారత్ పథకం కింద దేశవ్యాప్తంగా 2020నాటికి 1.5లక్షల ఆరోగ్య కేంద్రాలను ఏర్పాటు చేయాలని కేంద్రం లక్ష్యంగా పెట్టుకుంది. ప్రజలకు నాణ్యమైన ప్రాథమిక వైద్యం అందించడం, దీర్ఘకాలిక వ్యాధుల నియంత్రణకు క్షేత్రస్థాయిలో చర్యలు తీసుకోవడం ఈ పథకం ముఖ్య ఉద్దేశం. రాష్ట్రం, జిల్లా, బ్లాక్‌ స్థాయిలో అధికారులు ఈ పథకాన్ని పర్యవేక్షిస్తారు. అంతేకాకుండా ఇందులో రాష్ట్రాలు, జిల్లాల మధ్య పోటీ కూడా ఉంటుంది.





Untitled Document
Advertisements