తప్పకుండా న్యాయం జరుగుతుంది : జమ్ముకశ్మీర్‌ సీఎం

     Written by : smtv Desk | Fri, Apr 13, 2018, 02:02 PM

తప్పకుండా న్యాయం జరుగుతుంది : జమ్ముకశ్మీర్‌ సీఎం

శ్రీనగర్‌, ఏప్రిల్ 13: జమ్ముకశ్మీర్‌లోని కథువాలో ఎనిమిదేళ్ల బాలికను అపహరించి అత్యంత కిరాతకంగా అత్యాచారానికి పాల్పడిన ఘటనపై దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. ఈ ఘటనలో విచారణ వేగవంతం చేశామని, న్యాయాన్ని ఎవ్వరూ అడ్డుకోలేరని జమ్ముకశ్మీర్‌ ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీ వెల్లడించారు. కతువా ప్రాంతంలో వెనుకబడిన బఖ్రేవాల్‌ వర్గానికి చెందిన అసిఫా అనే బాలికను అపహరించి అత్యాచారానికి పాల్పడి ఆ తర్వాత హత్య చేసి సమీపంలోని అటవీ ప్రాంతంలో పడేసిన ఘటనలో పోలీసులు ఎఫ్‌ఐఆర్‌లో నమోదు చేసిన అంశాలు చాలా దారుణంగా ఉన్నాయి.

ఈ ఘటనపై సీఎం మెహబూబా ముఫ్తీ చాలా సీరియస్‌గా ఉన్నారు. విచారణ వేగంగా జరుగుతోందని, తప్పకుండా న్యాయం జరుగుతుందని ఆమె పేర్కొన్నారు. కొంతమంది బాధ్యత లేని పనులు, మాటల వల్ల న్యాయాన్ని అడ్డుకోలేరని అన్నారు.





Untitled Document
Advertisements