అతను 'బాహుబలి' కి చేయలేదు..

     Written by : smtv Desk | Fri, Apr 13, 2018, 02:50 PM

అతను 'బాహుబలి' కి చేయలేదు..

హైదరాబాద్, ఏప్రిల్ 13 : కేంద్ర ప్రభుత్వం 65వ జాతీయ ఉత్తమ చలనచిత్ర అవార్డులను ఢిల్లీలోని శాస్త్రి భవన్‌లో అధికారికంగా ప్రకటించారు. ఇందులో తెలుగు చిత్ర పరిశ్రమ ఖ్యాతిని ప్రపంచ వ్యాప్తంగా చాటిచెప్పిన "బాహుబలి: ది కన్‌క్లూజన్‌" చిత్రం మొత్తం మూడు అవార్డులను సొంతం చేసుకుంది. అందులో యాక్షన్ డైరెక్టర్ అబ్బాస్ అలీ మొఘల్‌ను బెస్ట్ యాక్షన్ డైరెక్టర్‌గా జ్యూరీ ప్రకటించింది. దీనికి "బాహుబలి" నిర్మాత శోభూ యార్లగడ్డ స్పందించారు.

"అబ్బాస్‌ అలీ మొఘల్‌? ఆయన 'బాహుబలి' చిత్రాల కోసం పనిచేయలేదు" అని ట్వీట్‌ చేశారు. 'బాహుబలి' కి యాక్షన్ డైరెక్టర్‌గా పీటర్ హెయిన్స్ పని చేశారు. దీనికి నెటిజన్లు సెటైర్లు వేస్తూ ట్వీట్స్ చేస్తున్నారు. బాహుబలి 3 కి చేస్తాడని ముందే ఊహించి ఇచ్చారని ఒకరంటే.. అతను కాలకేయ గ్యాంగ్ లో ఒకరేమో అంటూ మరొకరు ట్వీట్‌ చేశారు. ఇంతకి తప్పు ఎక్కడ జరిగిందో తెలియాల్సి ఉంది.Untitled Document
Advertisements