రషీద్ ఖాన్ ఉదారత.. బాలుడికి లక్షరూపాయల సాయం

     Written by : smtv Desk | Fri, Apr 13, 2018, 03:42 PM

రషీద్ ఖాన్ ఉదారత.. బాలుడికి లక్షరూపాయల సాయం

హైదరాబాద్, ఏప్రిల్ 13 : ఐపీఎల్ లో భాగంగా నిన్న ఉప్పల్ వేదికగా సన్ రైజర్స్ హైదరాబాద్- ముంబై ఇండియాన్స్ మధ్య జరిగిన రసవత్తర పోరులో హైదరాబాద్ ఒక వికెట్ తేడాతో విజయం సాధించింది. కాగా ఈ మ్యాచ్ లో రైజర్స్ తరుపున ప్రాతినిధ్యం వహిస్తున్న మిస్టరీ స్పిన్నర్ రషీద్ ఖాన్ అద్భుత ప్రదర్శన చేశాడు. 4 ఓవర్లు వేసిన రషీద్ 13 పరుగులు మాత్రమే ఇచ్చాడు. అందులో 18 బంతులు డాట్ చేయడం విశేషం. అత్యుత్తమంగా బౌలింగ్ చేసిన అతనికి 'మ్యాన్‌ ఆఫ్ ది మ్యాచ్' అవార్డు దక్కింది. ఈ అవార్డు ద్వారా వచ్చిన లక్షరూపాయల నగదును ఆస్పత్రిలో ఉన్న స్నేహితుడి కుమారుడికి సాయంగా అందించి తన ఉదారత చాటుకొన్నాడు.

మ్యాచ్ అనంతరం అవార్డు తీసుకున్నాక రషీద్ ఖాన్ మాట్లాడుతూ.." వీలైనన్ని ఎక్కువ డాట్‌ బాల్స్‌ వేయడం మా జట్టు వ్యూహాల్లో ఒకటి. ఇందులో భాగంగానే సరైన ప్రదేశాల్లో బంతులు వేస్తూ 18 డాట్‌ బాల్స్‌ వేయగలిగా. పొట్టి ఫార్మాట్‌ క్రికెట్‌లో డాట్‌ బాల్స్‌ కీలకపాత్ర పోషిస్తాయి. అందుకే నా వంతు కృషి చేశా. నేను అందుకున్న ఈ మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ అవార్డును ఆస్పత్రిలో ఉన్న నా స్నేహితుడి కుమారుడికి అంకితమిస్తున్నాను. ఈ అవార్డు కింద అందుకున్న లక్ష రూపాయల మొత్తాన్ని ఆ చిన్నారి వైద్యానికి అయ్యే ఖర్చుల కోసం అందిస్తాను’ అని రషీద్‌ తెలిపాడు.





Untitled Document
Advertisements