బ్లాక్ మెయిల్ చేసే రైస్‌ మిల్లర్లపై చర్యలు: మంత్రి సోమిరెడ్డి

     Written by : smtv Desk | Fri, Apr 13, 2018, 04:18 PM

బ్లాక్ మెయిల్ చేసే రైస్‌ మిల్లర్లపై చర్యలు: మంత్రి సోమిరెడ్డి

నెల్లూరు, ఏప్రిల్ 13: ధాన్యం కొనుగోళ్ళలో రైతులను బ్లాక్ మెయిల్ చేసే రైస్‌ మిల్లర్లపై చర్యలు తీసుకుంటామని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి అన్నారు.శుక్రవారం సంబంధిత అధికారులతో ధాన్యం కొనుగోళ్ళపై సమీక్ష సమావేశం నిర్వహించారు.

ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ... నెమ్ము, తరుగు పేరుతో రైతులను మోసం చేసే మిల్లర్లపై చర్యలు తప్పవన్నారు. అలాగే బీపీటీ ధాన్యం క్వింటాల్‌కి రూ.210 బోనస్ ప్రకటించామని, ధాన్యం ఎలా ఉన్నా కొనాలని సీఎం చంద్రబాబునాయుడు ఆదేశించారని మంత్రి తెలిపారు. శ్రీశైలం నుంచి 22 టీఎంసీల నీటిని తరలించి జిల్లాలో పంటలను కాపాడామని సోమిరెడ్డి అన్నారు. ఈ సమీక్ష సమావేశంలో ఆయ శాఖల అధికారులు పాల్గొన్నారు.





Untitled Document
Advertisements