మరోసారి భ్రమరాంబ తో చైతన్య..!

     Written by : smtv Desk | Fri, Apr 13, 2018, 05:35 PM

మరోసారి భ్రమరాంబ తో చైతన్య..!

హైదరాబాద్, ఏప్రిల్ 13 : "రారండోయ్ వేడుక చూద్దాం" లో నాగ చైతన్య, రకుల్ ప్రీత్ సింగ్ జంటగా నటించిన విషయం తెలిసిందే. మరోసారి ఈ జంట ప్రేక్షకులను అలరించడానికి సిద్దమైనట్లు తెలుస్తోంది. కాని ఈసారి ప్రత్యేకమైన పాటలో రకుల్ నాగచైతన్యతో ఆడిపాడనున్నట్లు సమాచారం. మైత్రీ మూవీస్‌ సంస్థ నిర్మాణంలో చందూ మొండేటి దర్శకత్వం వహిస్తున్న "సవ్యసాచి" చిత్రంలో 'చై' నటిస్తున్నారు.

ఈ చిత్రంలో నాగార్జున "అల్లరి అల్లుడు"లోని పాట.. 'నిన్ను రోడ్డుమీద చూసీనది లగాయత్తు' పాటని రీమిక్స్‌ చేస్తున్నారు. ఆ పాటలో రకుల్‌ ఆడిపాడనున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం రకుల్ తో సంప్రదింపులు జరుగుతున్నాయని, దాదాపుగా రకుల్‌తోనే ఈ పాట చిత్రీకరించే అవకాశాలున్నాయని చిత్రబృందం వెల్లడించింది. ఈ చిత్రంలో నిధి అగర్వాల్ కథానాయికగా నటిస్తోంది.

Untitled Document
Advertisements