ప్యారిస్ లో విహరిస్తున్న ప్రిన్స్ ఫ్యామిలీ..

     Written by : smtv Desk | Fri, Apr 13, 2018, 05:58 PM

ప్యారిస్ లో విహరిస్తున్న ప్రిన్స్ ఫ్యామిలీ..

హైదరాబాద్, ఏప్రిల్ 13 : సూపర్ స్టార్ మహేష్ బాబు తన షూటింగ్‌కు విరామం దొరికినప్పుడల్లా కుటుంబంతో కలిసి విహార యాత్రలకు వెళ్తూ సరదాగా సమయం గడుపుతుంటారు. తనకు ఏమాత్రం ఖాళీ దొరికినా తరచూ విదేశాలలో వాలిపోతు౦టారు. అక్కడి విశేషాలను మహేష్ భార్య నమ్రత అభిమానులతో పంచుకుంటూ ఉంటారు. తాజాగా నమ్రత ప్యారిస్ లో తీసిన కొన్ని ఫొటోలను సోషల్ ‌మీడియాలో పోస్ట్ చేశారు.

ప్యారిస్ లోని గ్రాండ్‌ పలైస్‌ ఎగ్జిబిషన్‌ను మహేశ్‌, సితార, గౌతమ్‌, నమ్రత సందర్శించారు. ఇందులో ప్రదర్శన చాలా అద్భుతంగా ఉందని, ఎంతో ఆకట్టుకుందని నమ్రత తెలిపారు. దీనికి సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం సోషల్‌ మీడియాలో అభిమానుల్ని ఆకట్టుకుంటున్నాయి. ప్రస్తుతం మహేష్.. కొరటాల శివ దర్శకత్వంలో "భరత్ అనే నేను" చిత్రంలో నటిస్తున్నారు. కైరా అద్వానీ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రాన్ని ఏప్రిల్ 20 న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.

Untitled Document
Advertisements