"నా పేరు సూర్య" నుండి 'బ్యూటీ ఫుల్ లవ్' సాంగ్...

     Written by : smtv Desk | Fri, Apr 13, 2018, 06:12 PM


హైదరాబాద్, ఏప్రిల్ 13 : అల్లు అర్జున్ కథానాయకుడిగా వక్కంతం వంశీ దర్శకత్వంలో 'నా పేరు సూర్య' చిత్రం రూపొందుతోంది. ఈ సినిమాలో అల్లు అర్జున్ సరసన అనూ ఇమ్మాన్యుయేల్ కథానాయికగా నటిస్తోంది. విశాల్, శేఖర్ ఈ చిత్రానికి సంగీతం అందించారు. ఈ సినిమాలోని "బ్యూటీ ఫుల్ లవ్" అనే మూడో పాటను విడుదల చేశారు.

ఈ సినిమాకు సంబంధించి ఇప్పటికే రెండు పాటలను విడుదల చేయగా.. అభిమానుల నుండి మంచి స్పందన వచ్చింది. ఇప్పుడు ఈ పాట ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుందని చిత్ర యూనిట్ వెల్లడించింది. సిరివెన్నెల సాహిత్యం అందించిన ఈ పాటకు విశాల్ శేఖర్ సంగీతం ఆహ్లాదకరంగా ఉంది. కాగా ఈ నెల చివరలో చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్ జరుపుకుని.. మే 4వ తేదీన ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

Untitled Document
Advertisements