కోచింగ్ సెంటర్ బాత్రూమ్‌ల్లో సీసీ కెమెరాలు..

     Written by : smtv Desk | Fri, Apr 13, 2018, 06:36 PM

కోచింగ్ సెంటర్ బాత్రూమ్‌ల్లో సీసీ కెమెరాలు..

అనంతపురం, ఏప్రిల్ 13 : అనంతపురంలోని లోటస్‌ కోచింగ్‌ సెంటర్‌ భద్రత పేరుతో చేసిన నిర్వాకం బట్టబయలైంది. వేలాది రూపాయలు దండుకునే కోచింగ్‌ సెంటర్లు మరింత రెచ్చిపోయి భద్రత పేరుతో అకృత్యాలు చేస్తున్నాయి. మహిళల బాత్రూమ్‌లో రహస్య కెమరాలు పెట్టి దారుణాలకు పాల్పడుతున్నారు. కోచింగ్‌ సెంటర్‌లోని మహిళల బాత్రూమ్‌ల్లో కెమరాలు పెట్టి వీడియోలు రికార్డు చేస్తున్నారు.

అయితే విషయం తెసుకున్న మహిళలు విద్యార్థులు ఈ దారుణం గురించి కుటుంబ సభ్యులకు తెలియజేశారు. దీంతో ఆగ్రహించిన తల్లిదండ్రలు కోచింగ్‌ సెంటర్‌పై దాడులకు దిగారు. కోచింగ్ సెంటర్‌ నిర్వాహకుడు సంజీవరాయుడును నిలదీసి, దేహశుద్ధి చేసి అనతరం పోలీసులకు అప్పగించారు.


Untitled Document
Advertisements