మైత్రిపాల సిరిసేన కీలక నిర్ణయం

     Written by : smtv Desk | Fri, Apr 13, 2018, 06:52 PM

మైత్రిపాల సిరిసేన కీలక నిర్ణయం

కొలంబొ, ఏప్రిల్ 13: శ్రీలంక అధ్యక్షుడు మైత్రిపాల సిరిసేన కీలక నిర్ణయం తీసుకున్నారు. వచ్చేవారంలో జరగబోయే పార్లమెంట్‌ సమావేశాలను రద్దు చేస్తున్నట్లు వెల్లడించారు. ఈ నిర్ణయానికి గల కారణాలను మాత్రం అధికారికంగా వెల్లడించలేదు. శ్రీలంక రాజ్యాంగం ప్రకారం 73వ అధికరణ ప్రకారం 266/ 43 పేరుతో ప్రత్యేక ప్రకటన విడుదల చేశారు. 12వ తేదీ అర్ధరాత్రి నుంచి ఈ ప్రకటన అమల్లోకి వస్తుందని మే 18 వరకు కొనసాగుతుందని పేర్కొన్నారు. ఆ దేశ పార్లమెంట్‌ ఏప్రిల్‌ 19న సమావేశం కానుంది. అక్కడ నెలకొన్న రాజకీయ సంక్షోభం నేపథ్యంలోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

Untitled Document
Advertisements