"బాఘి 2" మరో రికార్డు..

     Written by : smtv Desk | Sat, Apr 14, 2018, 12:01 PM


హైదరాబాద్, ఏప్రిల్ 14 : టైగర్‌ ష్రాఫ్‌, దిశా పటానీ కలిసి నటించిన చిత్రం "బాఘి 2". అహ్మద్‌ఖాన్‌ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం మార్చి 30న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్‌ వద్ద భారీ విజయాన్ని అందుకొని.. ఓవర్సీస్‌లోనూ మంచి టాక్‌ తెచ్చుకుంది. తెలుగులో ఘన విజయం సాధించిన "క్షణం" చిత్రం ఆధారంగా 'బాఘి 2' ను తెరకెక్కించారు. సాజిద్‌ నడియాద్‌వాలా నిర్మించారు. తొలి వారంలో ఈ సినిమా రూ.100 కోట్ల క్లబ్‌లో చేరింది.

అయితే తాజాగా ఇప్పుడు మరో రికార్డు సొంతం చేసుకుంది. 2018లో విడుదలైన చిత్రాల్లో రూ.200 కోట్ల క్లబ్‌లో చేరిన రెండో చిత్రంగా 'బాఘి 2' నిలవడం విశేషం. ఈ చిత్రానికి భారత్‌లో రూ.148.45కోట్ల కలెక్షన్లు రాగా, ఓవర్సీస్‌లో రూ.41.76కోట్లు వసూలు చేసింది. అంతర్జాతీయంగా అన్ని కలెక్షన్లు పరిగణనలోకి తీసుకుంటే ఈ ఏడాది రూ.200కోట్ల క్లబ్‌లో నిలిచిన రెండో చిత్రమైందని ప్రముఖ సినీ విశ్లేషకుడు ఒకరు తెలిపారు.

Untitled Document
Advertisements