ప్రియాంక 'ఎ కిడ్‌ లైక్‌ జాక్' ట్రైలర్.. చూశారా.!

     Written by : smtv Desk | Sat, Apr 14, 2018, 12:26 PM

ప్రియాంక 'ఎ కిడ్‌ లైక్‌ జాక్' ట్రైలర్.. చూశారా.!

ముంబై, ఏప్రిల్ 14 : బాలీవుడ్ భామ ప్రియాంక చోప్రా.. "బేవాచ్" చిత్రంతో హాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. తాజాగా ప్రియాంక రెండవ హాలీవుడ్ సినిమా "ఎ కిడ్‌ లైక్‌ జాక్‌". ట్రైలర్‌ను శుక్రవారం విడుదల చేశారు. జిమ్‌ పార్సన్స్‌, క్లైరే డేన్స్‌ ముఖ్య పాత్రధారులుగా నటిస్తున్న ఈ చిత్రంలో ప్రియాంక వీరికి స్నేహితురాలుగా అమల్‌ పాత్రలో నటిస్తున్నారు.

సిలాస్‌ హోవార్డ్‌ దర్శకత్వం వహించిన ఈ సినిమాను ఇప్పటికే సన్‌డ్యాన్స్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌లో ప్రదర్శించారు. ఓ నాలుగేళ్ల చిన్నారి జాక్‌ చుట్టూ ఈ కథ నడుస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ చిత్రంలో ప్రియాంక కనిపించేది కేవలం మూడు సెకన్లు మాత్రమేనట. కాని ఆ మూడు సెకన్లు ఈ సినిమాకు చాలా కీలకమని సమాచారం. ఇదివరకే హాలీవుడ్ లో "క్వాంటికో" అనే టీవీ సిరస్‌ ద్వారా ప్రేక్షకులను అలరిస్తోంది ఈ సుందరి. ఈ సిరీస్‌కు గానూ ఆమె రెండు పీపుల్‌ ఛాయిస్‌ అవార్డులు గెలుచుకున్నారు.

Untitled Document
Advertisements