రోడ్డు ప్రమాదంలో తల్లీకూతురు మృతి

     Written by : smtv Desk | Sat, Apr 14, 2018, 01:06 PM

రోడ్డు ప్రమాదంలో తల్లీకూతురు మృతి

మల్కాజిగిరి, ఏప్రిల్ 14: మల్కాజిగిరి ప్రాంతంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో తల్లీకూతురు మృతి చెందారు. బైక్‌పై బంధువుల ఇంటికి వెళ్లి వస్తున్న దంప తులను లారీ ఢీకొనడంతో భర్తకు గా యాలు కాగా భార్య, కూతురు మృతిచెందారు. ఎస్‌ఐ సంజీవరెడ్డి కథనం ప్రకారం... మహబూబ్‌నగర్‌ జిల్లా, కొత్తకోటకు చెందిన ప్రకాష్‌ మల్కాజిగిరి లాల్‌వాణీనగర్‌లో ఉంటున్నాడు.

ఈనెల 11న భార్య ప్రణీత(30), కుమారుడు ధన్‌రాజ్‌(5), కుమార్తె మానస(2)తో కలిసి ఉప్పల్‌ ఉంటున్న బంధువుల ఇంటికి వెళ్లారు. శుక్రవారం టీవీఎస్‌ మోపెడ్‌పై ఇంటికి తిరిగి వస్తుండగా జెడ్‌టీసీ క్రాస్‌ రోడ్స్‌ వద్ద వెనుక నుంచి వచ్చి లారీ ఢీ కొట్టడంతో మానస అక్కడికక్కడే మృతి చెందింది. తీవ్రంగా గాయపడిన ప్రణీతను గాంధీ ఆస్పత్రికి తర లించగా చికిత్స పొందుతూ మృతి చెందింది. ప్రకాష్‌ స్వల్పగాయాలతో బయటపడ్డాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Untitled Document
Advertisements