రాత్రి 10 గంటల తర్వాత ఫ్లై ఓవర్లు బంద్‌

     Written by : smtv Desk | Sat, Apr 14, 2018, 03:21 PM

రాత్రి 10 గంటల తర్వాత ఫ్లై ఓవర్లు బంద్‌

హైదరాబాద్, ఏప్రిల్ 14: శనివారం నగరంలో ఫ్లై ఓవర్లు మూసివేయనున్నారు. సాబ్ మెహరాజ్ జగ్నికే రాత్ సందర్భంగా ముస్లింలు ఈరోజు రాత్రి ప్రార్థనలు చేయనున్నారు. దీంతో ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా రాత్రి 10 గంటల తర్వాత ఫ్లై ఓవర్లు మూసివేస్తున్నట్టు ట్రాఫిక్ అడిషనల్ కమిషనర్ చౌహన్ ఓ ప్రకటనలో తెలిపారు.

కాగా, గ్రీన్‌ల్యాండ్ ఫ్లైఓవర్, పీవీ ఎన్‌ఆర్ ఎక్స్‌ప్రెస్ వే, లంగర్‌హౌస్‌ ఫ్లై ఓవర్లు మాత్రం యధావిధిగా ఉంటాయన్నారు. వీటికి మినహాయింపు ఉందని రాకపోకలు సాగించవచ్చని ఆయన పేర్కొన్నారు.
మరో వైపు డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ జయంతి ఉత్సవాలు నేపథ్యంలో పోలీసులు నగరంలో ట్రాఫిక్‌ ఆంక్షలు విధించారు. ట్యాంక్‌ బండ్‌ చౌరస్తా కేంద్రంగా శనివారం రాత్రి 8 గంటల వరకు ఈ ఆంక్షలు అమలులో ఉంటాయని తెలిపారు.

Untitled Document
Advertisements