ఐపీఎల్‌లో 'అతనొక్కడే'

     Written by : smtv Desk | Sat, Apr 14, 2018, 06:50 PM

 ఐపీఎల్‌లో 'అతనొక్కడే'

బెంగళూరు, ఏప్రిల్ 14 : ఐపీఎల్ -11 సీజన్ క్రికెట్ అభిమానులను ఎంతోగానో అలరిస్తుంది. ఈ మెగా టోర్నీ అంటే ఎన్నో రికార్డుల నమోదువుతూనే ఉంటాయి. తాజాగా ఆస్ట్రేలియా ఆటగాడు ఆరోన్ ఫించ్ సరికొత్త రికార్డు సృష్టించాడు. అదేంటో తెలుసా.. అత్యధిక జట్ల తరఫున ఐపీఎల్‌ ఆడటం. ఫించ్‌ ఇప్పటి వరకు ఏడు జట్లుకు ప్రాతినిథ్యం వహించాడు. ఆ తర్వాత ఆరు జట్ల తరఫున ఆడిన ఆటగాళ్ల జాబితాలో పార్ధీవ్‌ పటేల్‌, దినేశ్‌ కార్తీక్‌, థిసారా పెరీరా ఉన్నారు.

ఫించ్‌ తొలిసారి 2010లో రాజస్థాన్‌ రాయల్స్‌ తరఫున మొదటిసారి ఐపీఎల్‌లో ఆడాడు. ఆ తర్వాత దిల్లీ డేర్‌డెవిల్స్‌, పుణె వారియర్స్‌, సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌, ముంబయి ఇండియన్స్‌, గుజరాత్‌ లయన్స్‌కు తరుపున బరిలోకి దిగాడు. ప్రస్తుతం అతను కింగ్స్ X1 పంజాబ్ తరుపున ఆడుతున్నాడు. ఈ లెక్కన ఇప్పటి వరకూ మొత్తం ఏడు ఫ్రాంఛైజీలకు ఆడిన ఏకైక ఆటగాడిగా ఫించ్‌ రికార్డులలో నిలిచాడు. జనవరిలో నిర్వహించిన వేలంలో రూ.6.2 కోట్లు పెట్టి ఫించ్‌ను పంజాబ్‌ దక్కించుకుంది.





Untitled Document
Advertisements