కింగ్ నాగ్, నానిల చిత్రంలో హీరోయిన్స్ వీరే..!

     Written by : smtv Desk | Sat, Apr 14, 2018, 06:58 PM

కింగ్ నాగ్, నానిల చిత్రంలో హీరోయిన్స్ వీరే..!

హైదరాబాద్, ఏప్రిల్ 14 : అక్కినేని నాగార్జున, నేచురల్ స్టార్ నాని కలిసి వైజయంతి మూవీస్‌ పతాకంపై ఓ మల్టీస్టారర్ చిత్రం చేయనున్న విషయం తెలిసిందే. ఈ చిత్రానికి టి. శ్రీరామ్‌ ఆదిత్య దర్శకత్వం వహించగా.. సి.అశ్వనీదత్‌ నిర్మాతగా వ్యవహరించారు. అయితే ఈ చిత్రంలో కథానాయికలు ఎవరు అనే దానిపై ఇప్పటివరకు ఒక స్పష్టత లేకుండా పోయింది.

తాజాగా ఈ చిత్రంలో కింగ్‌ నాగార్జున సరసన ఆకాంక్ష సింగ్‌, నేచురల్‌ స్టార్‌ నాని సరసన రష్మిక మండన్న హీరోయిన్‌గా ఎంపికయ్యారు. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రంలో అవసరాల శ్రీనివాస్‌, సంపూర్ణేష్‌ బాబుతో పాటు ప్రముఖ నటీనటులు ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. మణిశర్మ సంగీత దర్శకత్వం వహిస్తున్నారు.

Untitled Document
Advertisements